ఫ్లోరిడాలో ఎమ్మెల్యే వసంత పర్యటన

Featured Image

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషించాలని ప్రవాసాంధ్రుల్ని కోరారు. గురువారం నాడు ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్సన్ విల్లే నగరంలో కూటమి ప్రభుత్వం యేడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం చేసి 75 వసంతాలు పూర్తి చేసుకొని వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ప్రవాసాంధ్రులు పీ4లో భాగస్వాములు కావాలని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని వసంత కోరారు. గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ... గత ప్రభుత్వం కొత్త పరిశ్రమలు తేకపోగా ఉన్న పరిశ్రమలు రాష్ట్రం వదిలి పోయేటట్టు చేసిందని మండిపడ్డారు.

ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సుమంత్ ఈదర, ఆనంద్ తోటకూర, అనిల్ యార్లగడ్డ, ఆనంద్ వక్కలగడ్డ, హరీశ్ కుమార్ వీరవల్లి, రాజేశ్ మాదినేని, గోపాల్ కుంట్ల, నాగేశ్వరరావు సూరి తదితరులు పాల్గొన్నారు.

Tags-MLA vasantha krishna prasad in jacksonville florida

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles