డల్లాస్‌లో నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు సమావేశం

Featured Image

పల్నాడు జిల్లా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు అమెరికా పర్యటనలో భాగంగా డాలస్‌లో ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. జొన్నలగడ్డ, దొండపాడు, పాములపాడు, రావిపాడు, ముత్తనపల్లి, నరసరావుపేట, పల్నాడు జిల్లాకి చెందిన పలువురు ప్రవాసులు ఎన్నారైలు పాల్గొన్నారు. నరసరావుపేట రూరల్ పార్టీ ప్రెసిడెంట్ బండారుపల్లి విశ్వేశరరావు, ఎన్నారై తెదేపా ప్రతినిధులు కేసీ చేకూరి, సుధీర్ చింతమనేని తదితరులు ప్రసంగించారు.

డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ...కూటమి ప్రభుత్వం అభివృద్ధి-సంక్షేమం ప్రధాన అజెండాగా ముందుకు పోతుందని, తద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. వచ్చే 15-20 ఏళ్ళు కూటమి అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ అభివృద్ధి దిశగా పయనిస్తోందని, నరసరావుపేటలో అనేక అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు. నందమూరి తారక రామారావు, కోడెల శివప్రసాదరావుకి నివాళులు అర్పించారు.

Tags-Narasaraopeta MLA Chadalavada Aravindbabu in Dallas

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles