విద్యార్థుల ఉజ్జ్వల భవితకు నాట్స్ చేయూత

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు ఉపకారవేతనాలు అందజేస్తున్నారు. నాట్స్ యూత్ స్కాలర్షిప్స్ పేరిట ఈ ఉపకారవేతనాలను అమెరికా-కెనడాల్లో హైస్కూల్ పూర్తి చేసుకుని కాలేజీకి వెళ్లే విద్యార్థులకు, ఇండియాలో ప్రభుత్వ విద్యాసంస్థలకు వెళ్లే పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు అందజేస్తారు. వారి తొలి అడుగులో బాసటగా ఈ నిధులు నిలబడుతున్నాయని ప్రవాసులు కొనియాడుతున్నారు.

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని రైతు కుటుంబాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గత నాలుగు సంవత్సరాలుగా స్కాలర్‌షిప్ అందజేస్తున్నారు. ZPPH హైస్కూల్‌, పెదనందిపాడు నుండి ఐదుగురు హైస్కూల్ విద్యార్థులు, PAS కాలేజ్‌, పెదనందిపాడు నుండి ఐదుగురు కాలేజ్ విద్యార్థులకు బాపు వ్యక్తిగతంగా రూ.10,000 చొప్పున స్కాలర్‌షిప్ అందిస్తున్నారు. ఇప్పటివరకు రూ.4,20,000లు అందజేశారు. 2023లో మొత్తం $9,000 స్కాలర్‌షిప్‌ను బాపు అందించారు. 2024లో $8,000 స్కాలర్‌షిప్ అందజేయగా ఇందులో $5000 బాపు, $3000 డా.శేఖరం విరాళంగా అందించారు. 2025లో కూడా $8,000 స్కాలర్‌షిప్ ఇవ్వగా, ఇందులో $4,000 బాపు, $4,000 డా. శేఖరం అందించారు. గత మూడు సంవత్సరాల్లో బాపు ఒక్కరే $18,000 విలువైన స్కాలర్‌షిప్‌ను అమెరికా/కెనడాలో నుండి అందించగా, డా. శేఖరం గత రెండు సంవత్సరాల్లో $7,000 స్కాలర్‌షిప్‌ విరాళం అందించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఈ స్కాలర్‌షిప్‌లు ఎంతో ఉపకరిస్తున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు ప్రోత్సాహం కలిగించేందుకు ఇది ఒక మంచి అవకాశమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉపకారవేతనాల లబ్ధిదారుల ఎంపిక 50శాతం ప్రతిభ, 50శాతం కుటుంబ ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని బాపు తెలిపారు. 2025 సంబరాల్లో ఉపకారవేతనాలను అందుకున్న ప్రవాస విద్యార్థులు నాట్స్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.

ఉపకారవేతనాలను అందుకునే విద్యార్థులను ఎంపిక చేసే కమిటీలో పాములపాటి మదన్, తుమ్మలపెంట శ్రీనివాసరావు, శాకమూరి వెంకట, ధూళిపాళ్ల భానుప్రకాష్, డా. యు. నరసింహారెడ్డిలు ఉన్నారు. విద్యార్థుల కోసం నిధులు అందజేస్తున్న బాపు, శేఖరంలను నాట్స్ అధ్యక్షుడు మందాడి శ్రీహరి, బోర్డు ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్‌లు అభినందించారు.

మరిన్ని వివరాలు https://www.natsworld.org/p/youth-scholarship-new.html?mrid=11773 వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

Tags-NATS 2025 Youth Scholarships

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles