లండన్‌లో ఘనంగా టాక్ బోనాల జాతర

Featured Image

లండన్‌లో తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుండి సుమారు 2000కి పైగా ప్రవాస కుటుంబాలు పాల్గొన్నాయి. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షురాలు శుష్మన రెడ్డి, కార్యదర్శి సుప్రజ పులుసు నేతృత్వంలో వేడుకలు ప్రారంభమయ్యాయి. సురేష్ బుడగం, గణేష్ కుప్పాల, శైలజా జెల్ల వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా సీమా మల్హోత్రా, వీరేంద్ర శర్మ, అమీ క్రాఫ్ట్, ఉదయ్ ఆరేటి, ఉదయ్ నాగరాజు, ప్రభాకర్ ఖాజా, అజమీర్ గ్రేవాల్, ప్రీతమ్ గ్రేవాల్, బంధన చోప్రా పాల్గొన్నారు.

తొట్టెల ఊరేగింపు ఆకట్టుకుంది. ఆలయం వద్ద సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనిల్ కూర్మాచలం, సిక్కా చంద్రశేఖర్ గౌడ్ పాల్గొన్నారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు మన సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజెప్పే ఈ తరహా ఉత్సవాలు అవసరమని, బ్రిటన్‌లో అన్ని వర్గాల మధ్య ఐక్యత ఏర్పాటుకు ఇవి సహకరిస్తాయని తెలిపారు.

నవీన్ రెడ్డి, మట్టా రెడ్డి, అశోక్ గౌడ్, శైలజా జెల్ల, గణేష్ పాస్తాం, శ్రీకాంత్ జెల్ల, సత్య చిలుముల, మల్లా రెడ్డి, నిఖిల్ రెడ్డి, హరి గౌడ్, మాధవ రెడ్డి, తరుణ్ లూణావత్, శ్వేత మహేందర్, స్వాతీ, శ్వేత, శ్రీ విద్య, నీలిమ, క్రాంతి, మని తేజ, విజయలక్ష్మి, రంజిత్, ఆనంద్, జస్వంత్, ఉమా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బోనాల జాతర విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన వారికి టాక్ కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది.

Tags-TAUK London Bonalu Jatara 2025,London Telugu NRI NRT News

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles