వర్జీనియా రాష్ట్ర కాంగ్రెస్‌మెన్‌తో RRR సమావేశం

Featured Image

వర్జీనియా రాష్ట్ర కాంగ్రెస్‌మెన్ సుహాస్ సుబ్రహ్మణ్యంతో ఏపీ అసెంబ్లీ డిప్యుటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. శుక్రవారం రాత్రి వాషింగ్టన్ డీసీలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరు భేటీ అయ్యారు. దక్షిణ భారతీయ మూలాలు ఉన్న సుహాస్ అటార్నీగా పనిచేశారు. 38ఏళ్ల వయస్సులోనే అమెరికా దిగువ సభ హౌజ్ ఆఫ్ రిప్రసెంటేటివ్స్‌కు ఎన్నికయ్యారు. ఆయన తండ్రి సికింద్రబాద్‌లో కొంతకాలం పనిచేశారు. సుహాస్ వంటి వారిని స్ఫూర్తి తీసుకుని యువత రాజకీయాల్లోకి రావల్సిన అవసరం ఉందని రఘురామ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాప్ ఛైర్మన్ రవి అనిమిని తదితరులు పాల్గొన్నారు.

Tags-AP Assembly Deputy Speaker Raghurama Meets Virginia Congressman Suhas

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles