సింగపూర్‌లో బోనాల పండుగ

Featured Image

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండుగ శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో ఆదివారం సాయంత్రం వేడుకగా నిర్వహించారు. తెలంగాణ జానపద గేయాలు, నృత్యాలు, భక్తిగీతాలు ముఖ్య ఆకర్షణలుగా నిలిచాయి. మహిళలు కుటుంబసమేతంగా భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. మట్టి కుండల్లో అన్నం, పాలు, బెల్లంతో చేసిన బోనాలను డప్పులు, పోతురాజులు, వేపపత్రాలతో ఆలయానికి తీసుకెళ్లి సమర్పించారు.

బోయిన స్వరూప, పెద్ది కవిత, సరితా తులా, దీపారెడ్డి, మోతే సుమతి, గంగా స్రవంతి, సంగీత తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పెద్దపులి ఆట, సాంస్కృతిక ప్రదర్శనలు, చిన్నారుల నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. కార్మిక సోదరుల భాగస్వామ్యం, పిల్లలకు సాంప్రదాయ పరిచయం సందడిగా సాగింది. కార్యక్రమం సంప్రదాయబద్ధంగా సాగింది.

నిర్వాహకులు బోయిన సమ్మయ్య, బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పుల్లన్నగారి శ్రీనివాసరెడ్డి, కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి, పోలిశెట్టి అనిల్ కుమార్, ప్రసాద్, ప్రదీప్, స్వాతి, గోపి కిషోర్, జనార్ధన్, జితేందర్, భైరి రవి, ప్రీతి, నవత తదితరులు సమన్వయపరిచారు. ఈ ఏడాది సమాజం సువర్ణోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

Tags-Bonalu in Singapore By Singapore Telugu Samajam STS,Singapore Telugu NRI NRT News

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles