బోస్టన్‌లో ఆముదాలవలస శాసనసభ్యుడి పర్యటన

Featured Image

జాతీయ శాసనసభ్యుల సమావేశం అమెరికాలోని బోస్టన్ నగరంలో నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనే నిమిత్తం భారతదేశానికి చెందిన 165 మంది శాసనసభ్యులు అమెరికాలో పర్యటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి ఆముదాలవలస శాసనసభ్యుడు కూన రవికుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రవికుమార్ బోస్టన్‌లోని స్థానిక ప్రవాసాంధ్రులను కలుసుకున్నారు. 2022లో బోస్టన్‌లో తెదేపా మహానాడును విజయవంతంగా నిర్వహించిన న్యూ ఇంగ్లాండ్ ఎన్నారై తెదేపా శ్రేణులతో ఆయన భేటీ అయ్యారు. అంకినీడు ప్రసాద్ సభికులకు స్వాగతం పలికారు. సూర్య తేలప్రోలు గత ఎన్నికలల్లో దొంగ ఓట్ల నిర్మూలపై ప్రసంగించారు. శ్రీ బోళ్ల తెదేపా ప్రభుత్వ పారదర్శక పాలనను వివరించారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కృషిని యావత్ ప్రపంచం కొనియాడుతుందని అన్నారు. శ్రీకాకుళంలో ఇండస్ట్రియల్ కారిడార్‌లో పెట్టుబడులు పెట్టి ప్రవాసాంధ్రులు సహకరించాలని కోరారు. వేణు కునమనేని వందన సమర్పణ చేశారు. సంపత్ కట్ట, విజయ్ బెజవాడ, గోపి నెక్కలపూడి, శేషుబాబు కొంతం, రాజేందర్, కృష్ణ ప్రసాద్ సోంపల్లి తదితరులు పాల్గొన్నారు.

Tags-Aamudalavalasa MLA Kuna Ravikumar Tours Boston And Meets NRI TDP Cadre

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles