నాట్స్ మాజీ అధ్యక్షుడు బాపుకు జస్టిస్ లావు అభినందనలు

Featured Image

జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మరిచిపోకూడదనేది నూతి బాపయ్య చౌదరిని చూసి నేర్చుకోవాలని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు అన్నారు. తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న బాపు నూతిని ఆయన అభినందించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్ధుల సౌకర్యార్థం నాట్స్ బోర్డ్ డైరెక్టర్, నాట్స్ మాజీ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి తన మితృబందంతో కలిసి నిర్మించిన నూతి సుబ్బారావు, సీతాదేవి భోజనశాలను లావు నాగేశ్వరరావు ప్రారంభించారు. బాపయ్య చౌదరి స్ఫూర్తితోనే తాను కూడా పెదనందిపాడు గ్రామ అభివృద్ధికి తన వంతు చేయూత అందిస్తానని తెలిపారు.

జన్మభూమి రుణం తీర్చుకోవాలని తపించే వారిలో బాపు నూతి ఒకరని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. బాపు చేస్తున్న కృషి అందరికి ఆదర్శమని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అన్నారు. నాట్స్ మన గ్రామం - మన బాధ్యత కార్యక్రమం ద్వారా తన స్వగ్రామం పెదనందిపాడు గ్రామములో విజ్ఞాన కేంద్రాల ఏర్పాటు, మహిళా సాధికారత, యువ సాధికారత, మెగా నేత్ర, వైద్య శిబిరాలు, ZPPH స్కూల్ డైనింగ్ హాల్ నిర్మాణంతో పాటు పలు సమాజ హిత కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాపు తల్లిదండ్రులు సుబ్బారావు, సీతాదేవిలను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు రహంతుల్లా, హనుమంతరావు, చంద్రయ్యలను సత్కరించారు. ప్రతిభ చూపిన పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించారు.

ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు, నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్స్ రాజేంద్ర మాదాల, రఘురాం రొయ్యురు, నాట్స్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ భీమినేని, గ్లో ఫౌండేషన్ సెక్రటరీ యార్లగడ్డ వెంకన్న చౌదరి, మాజీ ఎం పి పి నర్రా బాలకృష్ణ, లావు శివరామకృష్ణ, దాసరి శేషగిరిరావు, ముద్దన రాఘవయ్య, అర్వపల్లి కృష్ణ, రామారావు పాశం, డైనింగ్ హాల్ నిర్వహణ కమిటీ సభ్యులు కాకుమాను నాగేశ్వరరావు, దాసరి సుబ్బారావు, దాసరి రమేశ్, సుజిత్ ఆలూరి తదితరులు పాల్గొన్నారు.

Tags-Justice Lavu Nageswara Rao Appreciate Nuthi Bapu For His Charity To Pedanandipadu School

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles