జస్టిస్ ఎన్.వి.రమణకు మండలి ఫౌండేషన్ పురస్కారం

Featured Image

భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ మండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవ పురస్కారాన్ని అందుకోనున్నారు. కృష్ణారావు శతజయంతిని పురస్కరించుకుని అవనిగడ్డలో ఆయన తనయుడు మండలి బుద్ధప్రసాద్ గాంధీ క్షేత్రంలో శనివారం సాయంత్రం నిర్వహిస్తున్న కార్యక్రమంలో జస్టిస్ రమణకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.

కృష్ణాజిల్లాలో మారుమూల పల్లెలో జన్మించి, ఢిల్లీలో తెలుగు పతాకను రెపరెపలాడించి, న్యాయదేవత ముద్దుబిడ్డగా సేవలందించినందుకు గాను జస్టిస్ రమణను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు బుద్ధప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

Tags-Mandali Foundation Award To Justice NV Ramana

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles