నాట్స్ ఆధ్వర్యంలో మ్యూజిక్ థెరపీ

Featured Image

నాట్స్ ఆధ్వర్యంలో మ్యూజిక్ థెరపీ కార్యక్రమం నిర్వహించారు. గిన్నిస్ రికార్డు గ్రహీత స్వర వీణాపాణి తన సంగీతంతో ఆహుతులను అలరించారు. సంగీతం కేవలం వినోదం మాత్రమే కాదని, మనసును శాంతపరిచే ఒక శక్తిమంతమైన ఔషధం అని వీణాపాణి పేర్కొన్నారు. తాను అభివృద్ధి చేసిన స్మార్ట్-సింక్రనైజ్డ్ మ్యూజిక్ థెరపీ పద్ధతి ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చని వివరించారు. ఈ పద్ధతిలో వివిధ రాగాలను, వాటిలోని తరంగాలను ఉపయోగించి మెదడులోని నరాలను ఉత్తేజపరచడం, తద్వారా ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలను నిర్వారించవచ్చునని తెలిపారు.

ప్రముఖ ప్రవాసాంధ్రుడు దాము గేదెలను ఈ కార్యక్రమంలో నాట్స్ సత్కరించింది. తెలుగు వారిని కలిపే ఏ కార్యక్రమానికైనా దాము గేదెల అందించే మద్దతు అపూర్వమని వక్తలు కొనియాడారు. నాట్స్ అధ్యక్షుడు మందాడి శ్రీహరి, నాట్స్ పూర్వ అధ్యక్షుడు గంగాధర్ దేసు, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ(మీడియా) మురళీకృష్ణ మేడిచెర్ల, సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి, నేషనల్ కోఆర్డినేటర్ మార్కెటింగ్ కిరణ్ మందాడి, నార్త్ ఈస్ట్ జోన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, బోర్డు ఆఫ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, న్యూజెర్సీ చాప్టర్ కోఆర్డినేటర్ కుమార్ వెనిగళ్ల, జాయింట్ కోఆర్డినేటర్ ప్రసాద్ టేకి, రాకేష్ వేలూరు, రామకృష్ణ బోను, జతిన్ కొల్ల, వెంకట చైతన్య మాదాల, రమేష్ నూతలపాటి, చంద్రశేఖర్ కొణిదెల, వంశీ వెనిగళ్ల, రాజేష్ బేతపూడి, సూర్య గుత్తికొండ, శ్రీదేవి జాగర్లమూడి, ఈశ్వర్ అన్నం, సోమ, సుభద్ర పాటిబండ్ల, శేఖర్, వల్లి వేదుల, తెలుగు కళాసమితి అధ్యక్షుడు మధు అన్న తదితరులు పాల్గొన్నారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ధన్యవాదాలు తెలిపారు.

Tags-Swara Veenapani Music Therapy By NATS NJ

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles