విజయవాడ ఉత్సవాన్ని విజయవంతం చేయండి. ప్రవాసాంధ్రులకు కేశినేని పిలుపు.

Featured Image

విజయవాడకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చంద్రబాబు సారథ్యంలోని తెదేపా ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా 12ఏళ్ల తర్వాత విజయవాడ ఉత్సవ్ పేరిట 11 రోజుల పాటు విభిన్న కార్యక్రమాలకు రూపకల్పన చేశామని, ప్రవాసాంధ్రులు ఈ ఉత్సవాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) కోరారు. బుధవారం సాయంత్రం అంతర్జాలంలో విజయవాడ ప్రవాసాంధ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విజయవాడ ఎగ్జిబిషన్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా విజయవాడ నగరవ్యాప్తంగా సినీ, సంగీత, సాహిత్య, బాలల వినోదం, డ్రోన్ల ప్రదర్శన వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ప్రవాసాంధ్రులు ఇందులో భాగస్వామ్యులు కావడమే గాక వారి కుటుంబీకులను ఈ వేడుకల్లో పాల్గొనేలా ప్రోత్సహించి విజయవాడ ఖ్యాతిని వ్యాప్తి చేసే తమ ప్రయత్నానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. మైసూరు దసరా ఉత్సవానికి ప్రపంచం నలుమూలల నుండి అతిథులు హాజరు అవుతారని, విజయవాడ ఉత్సవ్ కూడా ఆ స్థాయికి ఎదగాలని వక్తలు ఆకాంక్షించారు.

ఉత్సవానికి సంబంధించిన కార్యక్రమాలను సినీ నిర్మాత అనీల్ సుంకర వెల్లడించారు. పుట్టగుంట సురేష్, సూరపనేని రాజా తదితరులు సమన్వయపరిచారు.

Tags-Vijayawada MP Kesineni Chinni Meets With Vijayawada NRTs Over Vijayawada Utsav

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles