మాజీ సీఎస్ జవహర్‌రెడ్డికి డల్లాస్‌లో సన్మానం

Featured Image

ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ కె.ఎస్.జవహర్ రెడ్డిని డల్లాస్‌లో స్థానిక ప్రవాసాంధ్రులు ఘనంగా సన్మానించారు. దశాబ్దాలపాటు రాష్ట్ర పరిపాలనకు ఆయన అందించిన సేవలు, చూపిన పారదర్శకత, నిర్వహించిన సంక్షేమ కార్యక్రమాలను సభికులు గుర్తుచేసుకున్నారు. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, సంక్షేమ పథకాల జవహర్ రెడ్డి కృషిని ప్రస్తావించారు. ఆయన సేవలు కొత్త తరాలకు ఆదర్శమని వ్యాఖ్యానించారు.

వై.ఎస్.జగన్ నాయకత్వంలో అమలు చేసిన విద్యా సంస్కరణలు, డిజిటల్ లెర్నింగ్, పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రాధాన్యత గురించి జవహర్ రెడ్డి వివరించారు. విద్యే సమాజ పురోగతికి పునాది అని, రాష్ట్ర భవిష్యత్తు తరాలకు బలమైన పునాదులు వేసే సంస్కరణల్లో భాగస్వామి కావడం తన వృత్తి జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో క్రిస్టపాటి రమణ్ రెడ్డి, డా. కొర్సపాటి శ్రీధర్ రెడ్డి, భీంరెడ్డి ప్రతాప్, అన్నపురెడ్డి శివ, కోడూరు కృష్ణారెడ్డి, మాధవి వర్మ, డా. ఆళ్ల శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags-Ex CS Jawahar Reddy Felicitated In Dallas

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles