సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం

Featured Image

విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల (VRSEC) 1996-2000 బ్యాచ్ పూర్వ విద్యార్థుల రజతోత్సవ సమ్మేళనం అమెరికాలోని అట్లాంటా సమీపంలో లేక్ లానియర్ ఐల్యాండ్‌లో నిర్వహించారు. 70 మంది విద్యార్థులు అమెరికా నలుమూలల నుంచే గాక వివిధ దేశాల నుంచి పాల్గొన్నారు.

పాత కబుర్లుతో జ్ఞాపకాలు పంచుకున్నారు. పికిల్‌బాల్, హైకింగ్, గోల్ఫ్ క్రీడల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు. లైవ్ దోస స్టాల్‌ అలరించింది. సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పద్మజ భరతనాట్యం, నీరజ జొన్నలగడ్డ కథక్ నృత్యాలు ఆకట్టుకున్నాయి. లేడీస్ గ్రూప్ తెలుగు మెడ్లీ డ్యాన్స్, సమరసింహారెడ్డి మూవీ ట్రైలర్ స్కిట్, శ్రీకాంత్ తుమ్మూ బోటనీ పాటముంది డాన్స్ ప్రదర్శనలు అలరించాయి. గతించిన బ్యాచ్ మేట్స్ సునీల్ అడ్డల, ప్రశాంతి, అరవింద్ చిల్లరపులకు నివాళులు అర్పించారు. ఈ సమ్మేళనంలో పాల్గొనలేని వారు తమ వీడియో సందేశాలను పంపారు. VRSEC వైస్ ఛాన్సలర్ ప్రొ. పరుచూరి వెంకటేశ్వరరావు ఆన్‌లైన్‌లో ప్రసంగించి విద్యార్థులను అభినందించారు.

పాలడుగు శ్రీధర్, చుక్కపల్లి చక్రవర్తి, అనిత వర్మ, జానకిరామ్, సుమా బొడ్డు, అట్లూరి శ్రీహరి, వేముగంటి ఆశాలత, చావా ఉపేన్, యార్లగడ్డ అనీల్, కడియాల ఫణీంద్ర, చల్లగుండ్ల శ్రీనివాస్, ఆళ్ల సుధాకర్ రెడ్డి, పద్మజ కర్రి, గూడవల్లి రాజేష్, అనుజ రమ, మన్నే గోపీ, తొట్టెంపూడి సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Tags-Vijayawada VRSEC Alumni Meet 2025 in USA

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles