ఐఐటీ హైదరాబాద్‌తో ఆటా ఒప్పందం

Featured Image

అమెరికా తెలుగు సంఘం(ATA) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్(IIT Hyderabad) మధ్య విద్యార్థుల గ్లోబల్ ఇంటర్న్‌షిప్ అవకాశాల కల్పన కోసం అవగాహన ఒప్పందం కుదిరింది. ఇంజినీరింగ్‌లో 7వ స్థానం, నూతన ఆవిష్కరణల్లో 6వ స్థానం సాధించిన ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ల ద్వారా విద్యార్థుల భవితకు బాటలు వేయనుంది.

ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి, ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా కొన్ని వారాల నుండి ఒక సంవత్సరం వరకు ఐఐటీలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభించనున్నాయి. ఈ ఒప్పందం మూడు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది.

జయంత్ మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులు ఆధునిక పరిశోధన, ఇన్నోవేషన్‌లలో అనుభవం పొందే మార్గాలు ఏర్పడతాయన్నారు. టెక్నాలజీ, రీసెర్చ్ రంగాల్లో జరుగుతున్న వేగవంతమైన మార్పులను అర్థం చేసుకోవడంలో యువతకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మూర్తి మాట్లాడుతూ తొలిసారిగా భారతదేశం వెలుపల ఐఐటీ ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. IITH అర్హులైన విద్యార్థులకు వసతి ఇతర సదుపాయాలు నామమాత్రపు ఫీజుతో కల్పిస్తుంది.

Tags-ATA Signs MoU With IIT Hyderabad

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles