గుంటూరులో వైభవంగా మన్నవ మోహనకృష్ణ జన్మదిన వేడుకలు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు.

Featured Image

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని చేబ్రోలు హనుమయ్య కంపెనీ గ్రౌండ్లో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ జన్మదిన వేడుకలు భారీ జనసందోహం నడుమ వైభవంగా నిర్వహించారు. మన్నవ మోహనకృష్ణ యూత్ సభ్యులు ఈ వేడుకలను సమన్వయపరిచారు. వేలాదిగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మోహనకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో అభిమానులు ర్యాలీలు నిర్వహించారు. మోహనకృష్ణకి గజమాలతో స్వాగతం పలికారు. అయనపై పూల వర్షం కురిపించారు. అభిమానుల కేరింతల మధ్య ఆయన కేక్ కట్ చేశారు.

ఎమ్మెల్యేలు గళ్ళా మాధవి, చదలవాడ అరవింద్ బాబు, భాష్యం ప్రవీణ్, మహ్మద్ నసీర్, వేగేశ్న నరేంద్ర వర్మ, MLC ఆలపాటి రాజేంద్రప్రసాద్, పలు కార్పోరేషన్ల ఛైర్మన్లు డేగల ప్రభాకర్, గోనుగుంట్ల కోటేశ్వరరావు, నాదెండ్ల బ్రహ్మం చౌదరి, మల్లె ఈశ్వరరావు, వడ్రాణం హరిబాబు, గుంటూరు నగర డిప్యూటీ మేయర్ సజీల, పల్నాడు జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, మన్నెం శివనాగ మల్లేశ్వరరావు, కొల్లి బ్రహ్మయ్య, వాసిరెడ్డి రవి, నిమ్మల శేషయ్య, తాళ్ళ వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొని మన్నవకి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా మోహనకృష్ణ మాట్లాడుతూ తన జన్మదినాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. జన్మదినం సందర్బంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గుంటూరులోని మాతృశ్రీ పిల్లల ఆశ్రమములో అనాథ పిల్లలకు స్కూల్ యూనిఫామ్లు, పుస్తకాలు అందించారు. ఆసుపత్రిలో పండ్లు పంచారు. వృద్ధులకు అన్నదానం చేశారు.

Tags-Mannava Mohanakrishna Birthday Celebrations 2025 In Guntur

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles