గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్(GTA) మొదటి ప్రపంచ సభ సన్నాహక సమావేశం

Featured Image

గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో డిసెంబర్ 27-28 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న తొలి ప్రపంచ మెగా కన్వెన్షన్‌కు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని అక్షయ కన్వెన్షన్‌లో శనివారం నాడు 33 జిల్లాల అడ్వైజరీ చైర్మన్లు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీలు, ట్రెజరర్లు కలసి బోర్డు మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో జీటీఏ ఫౌండర్ మల్లారెడ్డి ఆలుమల్ల, జీటీఏ కో-ఫౌండర్ పెండ్యాల ప్రతాప్ రెడ్డి, జీటీఏ ఇండియా ప్రెసిడెంట్ పాడూరు శ్రీనివాసరెడ్డి, కో-ఫౌండర్ & ప్రెసిడెంట్ ఎలెక్ట్ అభిషేక్ రెడ్డి కంకణాల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మంజులరావు జూపల్లి, వాషింగ్టన్ డీసీ విభాగ అధ్యక్షుడు రాము ముండ్రాతి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శోభ తదితరులు పాల్గొన్నారు. ఈ బోర్డు మీటింగ్‌లో కన్వెన్షన్ ఏర్పాట్లు, లక్ష్యాలు, కార్యక్రమాలపై చర్చించారు.

అతిథులు మాట్లాడుతూ ఎన్నారైలు తెలంగాణకు సేవ చేసేలా జీటీఏ మార్గం చూపుతోందని, ఐదుగురితో ప్రారంభించిన ఈ ప్రయాణం ఇప్పుడు 33 జిల్లాలు, అనేక సభ్యులతో విస్తరించిందని, ఈ మెగా ఈవెంట్‌లో 3000 ఎన్నారైలు పాల్గొంటున్నారని తెలిపారు. మెగా కన్వెన్షన్ లక్ష్యం...ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్నారైలను ఒకే వేదికపై తీసుకువచ్చి వారి సహకారంతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు నడిపించడం. ఈ కన్వెన్షన్ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ సేవలు అందించడమే కాక, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలు, స్కూల్స్, ఆరోగ్య సేవలు మరియు సమాజ సంక్షేమం కోసం గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా వర్తమాన సమస్యలకు పరిష్కారాలు తీసుకురావడం, అంతర్జాతీయంగా ఉన్న తెలంగాణ ప్రజలతో నెట్వర్కింగ్ పెంచడం మరియు వాస్తవమైన మార్పును తీసుకురావడం.

Tags-Global Telangana Assoc GTA 2025 World Conference Prep Meeting

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles