హ్యూస్టన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ దయాకర్

Featured Image

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ అమెరికాలో పర్యటిస్తున్నారు. బుధవారం (డిసెంబర్‌ 17న) హ్యూస్టన్‌లో తెలంగాణ ప్రవాసులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దయాకర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఫ్యూచర్ సిటీలో ఎన్నారైలకు విస్తృత పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ విజన్‌లో ఎన్నారైలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలు మరింత అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల నుంచి ఏమైనా సూచనలు ఉంటే వాటిని రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పరిష్కరించేందుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

Tags-Congress TS MLC Addanki Dayakar Tours Houston

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles