గుంటూరులో నాట్స్ జానపద సంబరాలు

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) గుంటూరులో జానపద సాంస్కృతిక సంబరాలు నిర్వహించింది. స్థానిక వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన ఈ కార్యక్రమం తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించే వేదికగా భాసిల్లింది. తప్పెటగుళ్లు, దరువులు, కోలాటాలుం తెలుగు జానపద శోభను ప్రతిబింబించాయి. ఇంజినీరింగ్ విద్యార్థులు కూడా ఈ సంప్రదాయ నృత్యాల్లో పాల్గొన్నారు. ప్రముఖ జానపద కళాకారుడు రమణ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ ప్రతిభతో ఉత్సాహాన్ని నింపారు.

మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మర్చిపోకూడదని నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. తెలుగునాట కనుమరుగవుతున్న జానపద కళలు మన అస్తిత్వానికి ప్రతీకలని వాటిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగు కళలను ప్రోత్సాహించేందుకు నాట్స్ ముందుంటుందని అధ్యక్షుడు శ్రీహరి మందాడి అన్నారు. గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా కళాకారులకు నాట్స్ అండగా నిలిచిందని గుర్తుచేశారు. నాట్స్ తెలుగు భాష కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.

ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులు, కవులు, కళాకారులను సత్కరించారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Tags-NATS Jaanapada Cultural Event In Guntur

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles