సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) సెయింట్ లూయిస్‌ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ సెంటర్‌లో ఉచిత వైద్య శిబిరం, ఉచిత ఫ్లూ షాట్ డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించారు. స్థానిక తెలుగు వారికి ఉచిత వైద్య సేవలు అందించారు.

నాట్స్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ అట్లూరి, ప్రముఖ హెమటాలజిస్ట్, ఆంకాలజిస్ట్ డాక్టర్ నిశాంత్ పొద్దార్, ఇంటర్నల్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ బాపూజీ దర్శి రోగుల ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని, వారికి అవసరమైన సూచనలు, పరీక్షలు చేశారు. చలికాలం దృష్ట్యా వ్యాధుల బారి నుండి రక్షణ పొందేందుకు డాక్టర్ ఏజే పర్యవేక్షణలో రోగులందరికీ ఉచితంగా ఫ్లూ వ్యాక్సిన్లను పంపిణీ చేశారు.

సమాజ సేవ చేసేందుకు నాట్స్ ముందుంటుందని మిస్సోరి చాప్టర్ కోఆర్డినేటర్ సందీప్ కొల్లిపర అన్నారు. వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లకు, మిస్సోరి చాప్టర్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. సెయింట్ లూయిస్‌లో ప్రతి నెల క్రమం తప్పకుండా వైద్య శిబిరం నిర్వహిస్తున్న మిస్సోరీ చాప్టర్ ప్రతినిధులను, వైద్యులను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు శ్రీహరి మందాడిలు అభినందించారు.

Tags-NATS St Louis Conducts Free Medical Camp

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles