తానా ఆధ్వర్యంలో ఉచిత ఆహార పంపిణీ

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) న్యూయార్క్ విభాగం ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా 375 కిలోల ఆహార సామగ్రిని సఫోక్ వై జెసిసి కమ్యూనిటీ ఫుడ్ ప్యాంట్రీకి విరాళంగా అందజేశారు. ఆహార కొరతతో బాధపడుతున్న స్థానిక కుటుంబాలకు ఈ విరాళం సాయపడుతుందని సమన్వయకర్త భర్తవరపు శ్రీనివాస్ అన్నారు. దీనితో పాటు వెటరన్స్ ఆఫ్ ఫారిన్ వార్స్(VFW) సైనికుల పిల్లల కోసం ఆహారం, బొమ్మలు, పాఠశాల సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని తానా నిర్వహించింది.

కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని, స్పెషల్ ప్రాజెక్ట్స్ కోఆర్డినేటర్ నాగ పంచుమర్తి సహకారంతో ఈ రెండు కార్యక్రమాలు నిర్వహించారు. దిలీప్ ముసునూరు, ప్రసాద్ కోయి, సుచరిత అనంతనేని, రజిత కల్లూరి, జితేంద్ర యార్లగడ్డ, శ్రీనివాస్ నాదెళ్ళ, రాజేశ్ కడియాల, కలీమ్ మహమ్మద్, యువ వాలంటీర్లు ఆశ్రిత కోయి, శరణ్ సాయి భర్తవరపు, గీతిక చల్లా, రజిత్ రెడ్డి, రమ్య రెడ్డి, లోహితాక్ష్ సాయి నాదెళ్ల , విష్ణు సాయి ఆశ్రిత్ రాచకుంట, సుధీక్ష ముసునూరు, సుహాస్ ముసునూరు, సమన్విత మిన్నెకంటి, ఆరిజ్ మహమ్మద్, ఐరా మహమ్మద్‌, ప్రసాద్ కంభంపాటి, శిరీష తూనుగుంట్ల, శైలజ చల్లపల్లి సేవలందించారు. తానా న్యూయార్క్ విభాగాన్ని అధ్యక్షుడు డా. కొడాలి నరేన్ అభినందించారు.

Tags-TANA Donates Free Food To New York Community Food Pantry

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles