200 కుటుంబాలకు సెయింట్ లూయిస్ ప్రవాసాంధ్రుల అన్నదానం

Featured Image

తానా సౌత్ సెంట్రల్ విభాగం ఆధ్వర్యంలో సెయింట్ లూయిస్ ప్రవాసాంధ్రులు పేదలకు ఉచితంగా అందించే నిమిత్తం ఆహార పదార్థాలను సేకరించారు. నవంబర్ 22 నుండి డిసెంబరు 15 మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమంలో 200 కుటుంబాలకు సరిపడా ఆహారాన్ని సేకరించి సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంకుకు విరాళంగా అందజేసినట్లు తానా ఫౌండేషన్ ట్రస్టీ సూరపనేని రాజా తెలిపారు. ఈ కార్యక్రమానికి చేయూతనందించిన దాతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమ నిర్వహణకు తానా సౌత్ సెంట్రల్ ప్రాంతీయ ప్రతినిధి పొట్ల రవి, పాతూరి దామోదర్, గంగవరపు రజనీకాంత్, బొప్పన నాగేశ్వరరావు, డా. చదలవాడ కూర్మనాథ్, యర్రపోతిన కిషోర్, యార్లగడ్డ కిషోర్, నర్రా సుధాకర్, వీరవల్లి రామకృష్ణ, పాతిరి వంశీ, సాక్షి విజయ్, బుడ్డి విజయ్, సురేన్ బైరపనేని తదితరులు సహకరించారు.

Tags-Saint Louis Telugus Food Donation Drive Helps 200 Families

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles