ఖతార్ క్రీస్తు సైనికుల చర్చిలో క్రిస్మస్ వేడుకలు

Featured Image

ఖతర్‌లోని వివిధ చర్చిలలో ప్రజలు క్రిస్మస్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. తెలుగు ప్రవాసీయుల చర్చి అయిన క్రీస్తు సైనికుల సహవాసం ఆధ్వర్యంలో కరుణామయుడు, శిలువ యాగం చేసిన ప్రేమ స్వరూపుడు ఏసు క్రీస్తు జన్మదినోత్సవం ఘనంగా జరిగింది. ఆంగ్లికన్ సెంటర్ ఫర్ రిలీజియస్ కాంప్లెక్స్ ప్రాంగణంలో పాస్టర్లు రమన్, అమృత్ నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా ఇరు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది తెలుగు క్రైస్తవులు పాల్గొన్నారు. వేడుకలలో పాల్గొనేందుకు దూర ప్రాంతాలైన అల్ ఖోర్, దుఖాన్, నిస్సేద్, సనయ్యాల నుండి కూడా పెద్ద సంఖ్యలో విశ్వాసులు వచ్చారు. ఖతర్‌లోని తెలుగు చర్చిలలో ప్రముఖమైన క్రీస్తు సైనికుల సహవాసం ప్రతి రోజూ ప్రభువు బోధనలను ప్రచారం చేస్తుంది. ఈ చర్చిని నరసపురానికి చెందిన రమన్, తునికి చెందిన అమృత్‌లు నిర్వహిస్తున్నారు. దేశంలోని ఇతర తెలుగు చర్చిలలో కూడా ప్రజలు క్రిస్మస్ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

Tags-Qatar Christmas 2025 By Tenali NRT Church Group

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles