సౌదీ అరేబియా...రియాద్‌లో క్రిస్మస్ వేడుకలు

Featured Image

సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలో శుక్రవారం సాటా ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుక భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించింది. జీసస్ జన్మించి నేటికి రెండు వేల ఏళ్లు దాటినా కరుణామయుడు గానూ, దయామయుడు గానూ ప్రపంచంలోని క్రైస్తవులతో ఆరాధనలను అందుకుంటున్నాడని ఉషా దుగ్గపు అన్నారు. అజిజీయా తెలుగుత చర్చి నుండి పాస్టర్ విల్సన్, రియాధ్ తెలుగు ఫెలోషిప్ నుండి స్టెన్లీ జోసేఫ్ బైబిల్‌లోని వాక్యాలు చదివి వినిపించి, క్రీస్తు బోధనలను వివరించారు. పాస్టర్ సతీష్ డేవిడ్ (సి.సి.యఫ్) క్యాండిల్ లైటు సర్వీసును ప్రారంభించగా, ఉజ్జయిని మినిస్ట్రీస్ పక్షాన సతీష్ కుమార్ కూడ వాక్యాలు వినిపించారు. రియాధ్ పీస్ గోస్పెల్ నుండి లక్ష్మణ్ స్టేఫెన్ పాల్గోన్నారు.

క్రిస్మస్ అలంకరణను ప్రియాంక బిల్లా, సుచరిత, రజనీ, సునీత, సంధ్య, శ్రీలక్ష్మి, అరుణ మరియు విజయలక్ష్మిలు లు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఎర్రన్న, ముజ్జమ్మీల్ శేఖ్, పోకూరి ఆనంద్, వెంకట రావు, షౌకత్ అలీ, వంశీ, జగదీశ్, రాంబాబు, థామన్, శ్రీనాథ్, అనిల్ కార్యక్రమ నిర్వహణలో సహకరించారు. డాక్టర్ ఇద్రీస్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు.

Tags-SATA Christmas 2025 In Riyadh Saudi Arabia

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles