క్లీవ్‌ల్యాండ్ ఒహాయోలో శంకర నేత్రాలయ నిధుల సేకరణ

Featured Image

శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో Echoes of Compassion – Where Arts Meet Heart అనే కార్యక్రమం ద్వారా ఒహియో చాప్టర్ తమ తొలి నిధుల సమీకరణ కార్యక్రమం క్లీవ్‌ల్యాండ్‌లో నిర్వహించారు. ఒహియో రాష్ట్ర సాంస్కృతిక కమిటీ సభ్యురాలు కల్యాణి వేటూరి సమన్వయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు పాల్గొని తమ మద్దతును అందించాయి. శాస్త్రీయ సంగీతం, భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాల అద్భుత సమ్మేళనంగా ఈ వేడుకలు ఆకట్టుకున్నాయి.

సంగీత ప్రదర్శనలు...సప్తస్వర అకాడమీ విద్యార్థులు(గురు విష్ణు పసుమర్తి, గురు కృష్ణ పసుమర్తి నాయకత్వంలో), మధురాలయ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ విద్యార్థులు(గురు లలిత్ సుబ్రహ్మణియన్ మార్గదర్శకత్వంలో), శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు...కల్యాణి వేటూరి శిష్యులు(కూచిపూడి), సుజాత శ్రీనివాసన్ శిష్యులు(భరతనాట్యం), అంతర దత్తా శిష్యులు(కథక్), సుధా కిరణ్మయి తోటపల్లి శిష్యులు(కూచిపూడి) అలరించాయి.

భరత్ పటేల్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. శంకర నేత్రాలయ U.S.A. అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి, నీలిమ గడ్డమనుగు, మూర్తి రేకపల్లి, డా. యు. నరసిమ్హారెడ్డి, వంశీ ఏరువరం, శ్యామ్ అప్పల్లి, రత్నకుమార్ కవుటూరు, గిరి కోటగిరి, అమర్ అమ్యరెడ్డి, గోవర్ధన్ రావు నిడిగంటిలు సహకరించారు.

Tags-Sankara Netralaya USA Fund Riser In Cleveland Ohio

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles