ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షురాలిగా మాధవి లోకిరెడ్డి

Featured Image

తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు పట్టం కట్టే ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(TANTEX) నూతన అధ్యక్షురాలిగా ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన లోకిరెడ్డి మాధవి బాధ్యతలు చేపట్టారు. ఆదివారం నాడు డాలస్ లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో 2026 నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. 1986లో ప్రారంభించబడి 40వ వార్షికోత్సవం జరుపుకొంటున్న ఘనచరిత్ర కలిగిన ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(TANTEX) సంస్థకు అధ్యక్షురాలిగా సేవలందించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తనకు ఈ బాధ్యత ఇచ్చిన సంస్థ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. సంస్థ ప్రమాణాలను పెంచే నూతన కార్యక్రమాలు చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడించారు.

Madhavi Lokireddy Takes Oath As TANTEX 2026 President

2026 కార్యవర్గం

అధ్యక్షురాలు- మాధవి లోకిరెడ్డి

ఉపాధ్యక్షుడు- సునీల్ సూరపరాజు

కార్యదర్శి- LN కోయా

కోశాధికారి- దీప్తి సూర్యదేవర

సహాయ కార్యదర్శి- వీర లెనిన్ తుళ్లూరి

సహాయ కోశాధికారి- లక్ష్మినరసింహ పోపూరి

ఉత్తరాధ్యక్షుడు- ఉదయ్ కిరణ్ నిడిగంటి

తక్షణ పూర్వాధ్యక్షుడు- చంద్రశేఖరరెడ్డి పొట్టిపాటి

కార్యవర్గ సభ్యులు- దీపికా రెడ్డి, RBS రెడ్డి, శివా రెడ్డి వల్లూరు, రవి కదిరి , అర్పిత ఓబులరెడ్డి, అనిత ముప్పిడి, పార్థ సారథి గొర్ల, శాంతి నూతి, మల్లికార్జున మురారి, పవన్ నర్రా, కమలాకర్ దేవరకొండ, వెంకట్ బొల్లా

పాలక మండలి అధ్యక్షుడు- దయాకర్ మాడా

పాలక మండలి ఉపాధ్యక్షురాలు- జ్యోతి వనం

పాలక మండలి సభ్యులు- శ్రీనాధ వట్టం, శ్రీనాధరెడ్డి పలవల, రాజారెడ్డి, ప్రవీణ్ బిల్లా, కల్యాణి తాడిమేటి

TPAD సభ్యులు అజయ్ రెడ్డి ఏలేటి, రావు కలవల, రఘువీర్ బండారు, జానకిరామ్ మందాడి, TANTEX నుండి సుబ్బు జొన్నలగడ్డ, మహేష్ ఆదిభట్ల, డా. యు. నరసిమ్హారెడ్డి, సతీష్ బండారు, శారద సింగిరెడ్డి, DARA నుండి శివారెడ్డి లేవంక, తిరుమల రెడ్డి కుంభం తదితరులు ఈ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొని మాధవికి అభినందనలు తెలిపారు. మరిన్ని వివరాలు www.tantex.org ద్వారా చూడవచ్చు.

Tags-Madhavi Lokireddy Is TANTEX 2026 President

Gallery