పదవీవిరమణ చేసిన బోస్టన్ తెలుగు సంఘం 2025-26 కార్యవర్గం

Featured Image

42 ఏళ్ల చరిత్ర కలిగిన బోస్టన్ తెలుగు సంఘం(TAGB) 2025-26 కార్యవర్గం పదవీవిరమణ చేసింది. తన హయాంలో సహకరించిన వాలంటీర్లు, కార్యకర్తలు, కార్యవర్గ సభ్యులకు అధ్యక్షుడు గొంది శ్రీనివాస్ తన వీడ్కోలు సందేశంలో ధన్యవాదాలు తెలిపారు.

రికార్డు స్థాయిలో 14 మంది గ్రాండ్ స్పాన్సర్లు ముందుకు రావడం, మెకానిక్స్ హాల్ వంటి ప్రతిష్టాత్మక వేదికపై అనూప్ రూబెన్స్ మ్యూజికల్ షో, మనీషా-అదితి-పృథ్వీ-షణ్ముఖప్రియ మెగా ఈవెంట్, మిసెస్ TAGB, మిస్టర్ TAGB, టీన్ TAGB పేజెంట్స్ నిర్వహణ, సంస్థకు సరికొత్త లోగో రూపకల్పన, TAGB సాంగ్, ఆధునిక జెఫ్ఫీ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్‌ను పరిచయం చేయడం, సంస్థకు సరికొత్త వెబ్‌సైట్ ఏర్పాటు, మహిళల కోసం ప్రత్యేక ఉమెన్స్ నైట్ వంటి కార్యక్రమాలను, అభివృద్ధిని తమ హయాంలో నిర్వహించినందుకు ఆనందంగా ఉందని శ్రీనివాస్ వెల్లడించారు.

Tags-TAGB Boston 2025-26 Transfers Power To New EC

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles