కన్నులపండువగా నెబ్రాస్కా తెలుగు సమితి సంక్రాంతి
తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు కన్నులపండువగా జరిగాయి. నెబ్రాస్కాలోని తెలుగు సమాజానికి మరపురాని అనుభూతిని అందించాయి. ఒమాహాలోని హిందూ టెంపుల్ ఆఫ్ ఒమాహాలో నిర్వహించిన ఈ వేడుకల్లో సంస్థ అధ్యక్షుడు కొల్లి ప్రసాద్ అతిథులకు సంక్రాంతి శుభాకంక్షలు తెలిపారు.
చిన్నారుల ఫ్యాషన్ షో, పిండి వంటల పోటీలు, ముగ్గుల పోటీలు, కోలాటం, హరిదాసు కీర్తనలు, తెలుగు క్విజ్, డ్రాయింగ్ పోటీలు ఆకట్టుకున్నాయి. ప్రవాసులు సంప్రదాయ వస్త్రధారణలో సందడి చేశారు. ప్రాంగణాన్ని రంగురంగుల అలంకరణలు, గాలిపటాలు, పంటల ప్రతీకలతో ముస్తాబు చేసి పండుగ వైభవాన్ని పెంచారు. వ్యాపార స్టాల్స్ వద్ద కొనుగోళ్ల సందడి సాగింది. పాటలు, నృత్యాలు, స్కిట్లు, వాద్య ప్రదర్శనలుతో తెలుగు సంస్కృతి వైభవాన్ని అద్భుతంగా ప్రతిబింబించారు. చిన్నారులు, యువత, పెద్దలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
2025-26 నూతన కార్యవర్గాన్ని ఉపాధ్యక్షుడు తాతారావు కొసూరి పరిచయం చేశారు. యూత్ కమిటీ చైర్ క్రాంతి సుధా యూత్ కమిటీ సభ్యులను పరిచయం చేశారు. సాంబశివరావు, కొల్లి రామకృష్ణ, క్రాంతి అడ్డిడం, శ్రీనివాస్ నెడునోరిలను ఘనంగా సన్మానించారు. సమితి తెలుగుబడి ఉపాధ్యాయులను సత్కరించారు. తెలుగు బడి ప్రిన్సిపాల్ వేణు మురకొండ మాట్లాడుతూ ఇప్పటివరకు 61 మంది విద్యార్థులు నమోదు కావడం ఆనందదాయకమని అన్నారు. భోగి పండ్ల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
విద్యార్థులకు సమితి తరఫున ఉపకారవేతనలను ఈ ఏడాది తొలిసారిగా ప్రారంభించారు. యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా ఒమాహా, యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా లింకన్లో చదువుతున్న లేదా చేరబోయే తెలుగు విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సమితి కార్యవర్గం వెల్లడించింది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ఏఋట్) ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. అనారోగ్యాలు, ప్రమాదాలు, సహజ విపత్తులు వంటి సందర్భాలలో తెలుగు కుటుంబాలకు మార్గదర్శకత్వం, సమాచార సహాయం, మానవీయ తోడ్పాటు అందించేందుకు ఈ బృందం పని చేయనుందని నిర్వాహకులు తెలిపారు.
సాంప్రదాయ తెలుగు విందు పండుగ సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచింది. సాంస్కృతిక కమిటీ చైర్‌పర్సన్ రమ్య రవిపాటి, కో-చైర్‌పర్సన్ వినీల నాయుడు, కార్యవర్గ సభ్యులు, గ్రాండ్ స్పాన్సర్ నాగ కటకం దంపతులు, ప్యాట్రన్ మెంబర్స్ సత్యనారాయణ పావులూరి, సుందర్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీ అలగన్ కంచర్ల వందన సమర్పణ చేశారు.
Tags-Telugu Samithi Of Nebraska Sankranti 2026
bodyimages:
Latest Articles
- Tantex 2026 Sankranti In Frisco
- Myta Malaysia Performs For Indian Pm Modi
- Tagkc Kansas City Telugus Celebrate 2026 Sankranthi
- Apts Helps Build Andhras First Co Working Space And Digital Library In Kuppam
- Siliconandhra Silver Jubilee On August 8Th 2026
- Bavaria Indians Celebrate Festival Of Togetherness 2026
- Gta Announces 2026 27 Ec And Bot
- Tagb Boston 2025 26 Transfers Power To New Ec
- Ata Pennsylvania Delaware Teams Meet To Discuss Ata 2026 Conference Arrangement
- Mega Kamma Mahanadu In Tamil Nadu By Kgf On February 8Th
- Chetana Foundation Charity Events In Kalwakurthy
- Doha Music Lovers Singing And Dance Competition Across India
- Nats Announces 2026 27 Bod Members
- Achievements Of Padmabhushan Dr Nori Dattatreyudu
- Andhra Kalavedika Qatar 2026 Telugu Sankranti
- Global Nri Brs Internet Meet 2026 By Mahesh Bigala
- Tana Mid Atlantic Celebrates 2026 Telugu Sankranti
- Chicago Andhra Assoc Caa 2026 Telugu Sankranti And Rangoli Competition
- Apts Chairman Mannava Mohanakrishna Celebrates Nara Lokesh Birthday With Tableau
- Tpad 2026 Ec And Bot Takes Oath