న్యూయార్క్ తానా ఆధ్వర్యంలో అత్యవసర వైద్య శిక్షణ శిబిరం

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో శనివారం నాడు న్యూయార్క్‌లోని అసమై హిందూ టెంపుల్‌లో CPR-AED సర్టిఫికేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విజయవంతంగా నిర్వహించారు. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడే నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తానా న్యూయార్క్ ప్రాంతీయ ప్రతినిధి భర్తవరపు శ్రీనివాస్ తెలిపారు. ఈ శిక్షణ శిబిరంలో 30 మంది పాల్గొన్నారు. శిక్షణ తరగతులను విజయవంతంగా పూర్తి చేసిన వీరికి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నుండి 2 సంవత్సరాల సర్టిఫికేషన్ అందజేశారు.

ప్రసాద్ కోయి, సుచరిత అనంతనేని, రజిత కల్లూరి, జితేంద్ర యార్లగడ్డ, దిలీప్ ముసునూరు, శ్రీనివాస్ నాదెళ్ళ, రాజేశ్ కడియాల, కలీమ్ మహమ్మద్, ప్రదీప్ అరవేటి, ఆశ్రిత కోయి, శరణ్ సాయి భర్తవరపు, గీతిక చల్లా, విష్ణు సాయి ఆశ్రిత్ రాచకుంట, సుధీక్ష ముసునూరు, సుహాస్ ముసునూరు, సమన్విత మిన్నెకంటిలు సహకరించారు. TLCA అధ్యక్షుడు సుమంత్ రామశెట్టి, NYTTA అధ్యక్షుడు రవీంద్ర కోడెలలు పాల్గొన్నారు. తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, తానా హెల్త్ సర్వీసెస్ కోఆర్డినేటర్ మాధురి యెలూరి, కోశాధికారి రాజా కసుకుర్తిలు మార్గనిర్దేశం చేశారు.

Tags-TANA New York Conducts CPR Training Session

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles