కల్వకుర్తిలో చేతన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు

Featured Image

కల్వకుర్తి ప్రాంతంలోని చాలా మంది ప్రజలు జీవనోపాధి లేక వ్యవసాయంతో పాటు కూలి నానిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అలాంటి పేద, బడుగు, బలహీన వర్గాల వారిని స్వచ్ఛందంగా గుర్తించి ఉపాధి కల్పించే దిశగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం కల్వకుర్తి ప్రాంత ప్రజల అదృష్టమని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

మండల కేంద్రంలోని దేవకి గార్డెన్స్‌లో బుధవారం చేతన ఫౌండేషన్, యుఎస్ ఫౌండెషన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదవారికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో 40 కుట్టు మిషన్లు, 12 తోపుడు బండ్లు, వికలాంగుల కోసం ట్రైసైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చేతన ఫౌండేషన్ చైర్మన్ రవికుమార్, యూఎస్ ఫౌండేషన్ చైర్మన్ ఎర్ర. సుధాకర్ రెడ్డిలు పాల్గొన్నారు.

చేతన రవికుమార్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు రూ.50కోట్ల మేర సేవా కార్యక్రమాలు నిర్వహించామని, బడుగు వర్గాలకు, విద్యార్థులకు, నిరుపేదలకు, అనాథాశ్రమాలకు, చిరు వ్యాపారులకు తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని చేయూత కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

Tags-Chetana Foundation Charity Events In Kalwakurthy

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles