ఖతార్‌లో వేడుకగా ఆంధ్ర కళావేదిక సంక్రాంతి

Featured Image

ఖతార్ ఆంధ్ర కళావేదిక ఆధ్వర్యంలో 'సంక్రాంతికి వస్తున్నాము' సాంస్కృతిక మహోత్సవం అల్‌వక్రాలో వేడుకగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించే హరిదాసు, కోడిపుంజులు, గాలిపటాలు, పాలుపొంగించే అలంకరణలు ఆకట్టుకున్నాయి. శ్రీకృష్ణ లీలల నృత్య నాటిక, కృష్ణచైతన్య-మాళవికల యుగళ గీతాలు, డాన్స్ మాస్టర్ సత్య-తేజస్విని ప్రదర్శనలతో అలరించారు. నటుడు పృధ్వీ(థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ) హాస్యభరిత అనుకరణలు, ఆయన కుమార్తె శ్రీలు చేసిన నృత్యం ప్రేక్షకుల మన్ననలు పొందింది.

ఖతార్‌లోని భారత రాయబారి విపుల్, ఐసీసీ ప్రెసిడెంట్ మణికంఠన్, హెడ్ ఆఫ్ ఛాన్సరీ అండ్ కౌన్సిలర్ డా. వైభవ్ తండాలేలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కళావేదిక అధ్యక్షుడు రమణయ్య అతిథులకు శుభాకాంక్షలు తెలిపారు. ఖతార్‌లోని తెలుగు కుటుంబాలు, పెద్ద సంఖ్యలో పాల్గొనడం తనకు ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఏపీ నాటక అకాడమీ అధ్యక్షుడు గుమ్మడి గోపాలకృష్ణ తన అద్భుతమైన తెలుగు పద్యాలతో సభను ఉర్రూతలూగించారు. హీరో రామ్ కీ, నటి దివి నృత్యం, జానపద గాయకులు సరళ-జాన్ గీతాలు ప్రేక్షకులను పల్లె వాతావరణానికి తీసుకెళ్లాయి. యాంకర్ స్వప్న చౌదరి ఆకట్టుకుంది. టి.డి. జనార్దన్ నందమూరి తారక రామారావు గురించి హృద్యంగా వివరించారు. కళావేదిక ఉపాధ్యక్షుడు జీ.కె.దొర వందన సమర్పణ చేశారు.

Tags-Andhra Kalavedika Qatar 2026 Telugu Sankranti

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles