ఆగష్టు 8న సిలికానాంధ్ర రజతోత్సవం

Featured Image

తెలుగు సాహితీ సాంస్కృతిక సాంప్రదాయ స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటేందుకు 2001వ సంవత్సరంలో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఏర్పడిన సిలికానాంధ్ర సంస్థ రజతోత్సవ వేడుకల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఆగష్టు 8వ తేదీ శనివారం నాడు కాలిఫోర్నియాలోని ఓక్‌ల్యాండ్ ఎరీనాలో ఉదయం 9గంటల నుండి రాత్రి 10గంటల వరకు ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు సిలికానాంధ్ర వ్యవస్థాపక ఛైర్మన్ కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. తెలుగు సాంప్రదాయాన్ని పాటిస్తూ సిలికానాంధ్ర సభ్యులతో కలిసి ఆయన రజతోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను శని, ఆదివారాల్లో స్థానిక ప్రవాస తెలుగువారి ఇంటింటికీ వెళ్లి అందజేశారు. అమెరికావ్యాప్తంగా ప్రవాస తెలుగువారిని ఇదే విధంగా వారి ఇంటికి వెళ్లి ప్రత్యక్షంగా ఆహ్వానించేందుకు సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆనంద్ వెల్లడించారు. 15వేల మంది తెలుగువారు ఈ రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. ప్రవాస తెలుగు పరిమళాలకు ఈ రజతోత్సవ వేదిక పెద్దపీట వేస్తుందని తెలిపారు.

Tags-SiliconAndhra Silver Jubilee On August 8th 2026

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles