ఆటా సభల నిర్వహణకు 70కమిటీల ఏర్పాటు

Featured Image

19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) మహాసభలు జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ సభల ప్రణాళిక, ఏర్పాట్ల సమీక్షపై ఎలికాట్ సిటీలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కమిటీల ఏర్పాటు, సమన్వయ విధానాలపై చర్చించారు. డెలావేర్, మెరిల్యాండ్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, వర్జీనియా రాష్ట్రాల నుంచి సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 70 కమిటీల బాధ్యతలపై సమీక్ష నిర్వహించారు. సదస్సు నిర్వహణ సాఫీగా సాగేందుకు వివిధ బృందాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.

కమిటీలకు సంబంధించిన చైర్లు, కో-చైర్లు, సభ్యుల పేర్లతో కూడిన ప్రాథమిక జాబితాను విడుదల చేశారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, సభల కన్వీనర్ శ్రీధర్ బనాలా, ఇతర సభ్యులు శరత్ వేముల, రవి చల్లా, సుధీర్ డమిడి, జీనత్ కుందూర్, తిరుమల మునుకుట్ల, కౌశిక్ సమా, కిరణ్ ఆలా, శ్రీనివాస్ దర్గుల, సంతోష్ రెడ్డి, రాజిరెడ్డి, కృష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags-ATA 2026 Conference Planning Meeting In Ellicott City

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles