ఏప్రిల్ 4న హ్యూస్టన్ TCA ఉగాది

Featured Image

హ్యూస్టన్‌లోని Telugu Cultural Association ఈ ఏడాది ఉగాది వేడుకలను ఏప్రిల్ 4వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ అలంకరణలు, సంగీతం, నృత్య ప్రదర్శనలు, ఉగాది ప్రత్యేక విందు ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా ఉంటాయని కార్యవర్గం తెలిపింది. ప్రవాస తెలుగువారు కుటుంబ సమేతంగా పాల్గొని కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానించాలని నిర్వాహకులు కోరారు.

గాయకులు సుస్వరం అనిరుధ్, యుతి హర్షవర్ధనల సంగీత కార్యక్రమంతో ప్రేక్షకులను అలరించనున్నారు. సంస్థ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్వర్ణోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఐదు దశాబ్దాలుగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తూ కమ్యూనిటీని ఒకే వేదికపైకి తీసుకువచ్చిన సంస్థ ప్రయాణాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోనున్నారు.

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles