ఫీనిక్స్ ఆటా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

Featured Image

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఫీనిక్స్ చాప్టర్ ఆధ్వర్యంలో 4వ వార్షిక మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫీనిక్స్ పరిసర ప్రాంతాల నుంచి 200కు పైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళల ఐక్యత, స్నేహం, సాధికారతను ప్రతిబింబించేలా ఈ వేడుకలు ఏర్పాటు చేశారు.

సంగీతం, నృత్య ప్రదర్శనలు, వినోదాత్మక ఆటలు ఆకర్షణగా నిలిచాయి. మహిళలు తమ జీవిత అనుభవాలను, ప్రేరణాత్మక కథలను అతిథులతో పంచుకున్నారు. స్టాళ్ల వద్ద మహిళలు సందడి చేశారు. ఆటా అధ్యక్షుడు చల్లా జయంత్, తదుపరి అధ్యక్షుడు సతీష్ రెడ్డిలు ఫీనిక్స్ ఆటా విభాగ సభ్యులకు, మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags-ATA Phoenix Celebrates 4th Annual Womens Day

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles