సింగపూర్‌లో శంకరాభరణం వెండితెర నవల పుస్తకావిష్కరణ

Featured Image

శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో సీనియర్ దర్శకుడు వంశీ రచించిన శంకరాభరణం వెండితెర నవల పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. దర్శకుడు కె.విశ్వనాథ్ కుమారుడు కె.నాగేంద్రనాథ్ చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరించారు. సంస్థ అధ్యక్షుడు రత్నకుమార్ కవుటూరు నాగేంద్రనాథ్‌తో తన పరిచయం గురించి ప్రస్తావించారు. వంశీకి, చిత్రనిర్మాత ఏడిద నాగేశ్వరరావు కుటుంబసభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

నాగేంద్రనాథ్ మాట్లాడుతూ శంకరాభరణం చిత్రం విడుదల సమయంలో వచ్చిన ఈ పుస్తకం తెలుగు ప్రజల అభిమానాన్ని విశేషంగా చురగొందని తెలిపారు. పాఠకుల కోరిక మేరకు పున:ముద్రణ చేశారని పేర్కొన్నారు. పుస్తకం తొలిప్రతిని సంస్కార భారతి అధ్యక్షుడు రమణమూర్తి, సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షుడు బి.వి.ఆర్.చౌదరి, తంగిరాల రాజశేఖర్-సౌభాగ్యలక్ష్మిలు అందుకున్నారు.

శంకరాభరణం చిత్రంలోని గీతాలను చంద్రహాస్ ఆనంద్, షర్మిల, కిరీటి దేశిరాజు, సౌభాగ్యలక్ష్మి, శేషు యడవల్లి, శేషశ్రీ(వీణ) పాడి అలరించారు. దర్శకుడు విశ్వనాథ్‌తో తమ పరిచయాలను పూజా కండ్రప, రామచంద్రరావు ప్రేక్షకులతో పంచుకున్నారు. పుస్తక విశేషాలను వేణు రెడ్డి, రాధికా మంగిపూడి, రాంబాబు పాతూరి, శేషు యడవల్లి, సుబ్బు పాలకుర్తి, కోనాల కాళీకృష్ణ తదితరులు వివరించారు. శ్రీలలిత, మాధవి పాలకుర్తి, శ్రీధర్ భరద్వాజ్, సత్య జాస్తి, రాజ్ కుమార్ తదితరులు సహకరించారు.

Tags-Shankarabharanam Book By Vamsi Launched In Singapore By K Viswanath Son Nagendranath

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles