🕑 Published: March 16, 2026 at 03:36 PM CST
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) వనితా వేదిక ఆధ్వర్యంలో “United in Wellness – Celebrating Women in Our Community” పేరిట మహిళల ఆరోగ్య, యోగ కార్యక్రమం ఫ్రిస్కోలోని Youth Excellence Centerలో విజయవంతంగా నిర్వహించారు. స్థానిక ప్రవాస తెలుగు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో యోగ సెషన్ నిర్వహించడంతో పాటు ప్రముఖ వైద్య నిపుణులు డా. యమున గుర్రపు, డా. సురేఖ మాచుపల్లిలు మహిళల ఆరోగ్యం, నివారణ వైద్యం, మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నియంత్రణ, ఆరోగ్యకరమైన జీవన విధానంపై పలు విలువైన సూచనలు అందించారు. టాంటెక్స్ అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం, సంక్షేమం..సమాజ అభివృద్ధికి ముఖ్యమని అన్నారు. వనితా వేదిక చైర్ దీపికా పేట ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. ఈ సందర్భంగా విరాళంగా అందజేసేందుకు దుస్తులను సేకరించారు.



