🕑 Published: March 17, 2026 at 08:31 PM CST
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం నాడు డెలావేర్‌లో చెస్ పోటీలు నిర్వహించారు. స్థానిక ప్రవాస బాలలు, యువతీయువకుల మేధస్సుకు, తమలోని ప్రతిభకు ఈ పోటీలు అద్దంపట్టాయి. ఎత్తులు, పైఎత్తులతో ఆటగాళ్లు అలరించారు.
టోర్నమెంట్ డైరెక్టర్ జోషువా ఆండర్సన్, తానా చెస్ ఈవెంట్ కోఆర్డినేటర్ నాయుడమ్మ యలవర్తిలు పోటీలను సమర్థవంతంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు. తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, తానా బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగులలు పోటీలను సమన్వయపరిచారు. యువతలో మేధోపరమైన నైపుణ్యాలను పెంపొందించడానికి తానా ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.
మిడ్-అట్లాంటిక్ బృంద సభ్యులు సతీష్ తుమ్మల, సత్యనారాయణ పొన్నగంటి, సునీల్ కోగంటి, రంజిత్ మామిడి, నవీన్ ఘంటా, హిమతేజ మికిలినేని, యువ వాలంటీర్లు తపస్వి ఘంటా, కృతి రెడ్డి నిమ్మ, లాలిత్య రెడ్డి యెరువ, ప్రణవ్ కంతేటి, ఆర్నవ్ కంతేటి, దివిత్ శర్మ, కిషోర్ కుకలకుంట్ల, శ్రీదేవి నెక్కలపులు సహకరించారు. క్రీడాకారులకు మరియు వాలంటీర్లకు సర్టిఫికేట్లు అందజేశారు.
విజేతలు
నాన్ రేటెడ్ కె. 8 విభాగంలో...
ధన్విన్ అమిరిశెట్టి, అనయ్ వర్మ, సరాన్ష్ సాగర్
నాన్-రేటెడ్ 9-12 (పెద్దలతో కలిపి)
చాణక్య వర్ధన్ కేతిరెడ్డి, లాల్ ఎం, ధ్రుపద్ వెలగపూడి
రేటెడ్ 500 లోపు
హర్షిత్ కన్నన్, రేయాన్ష్ కక్కెర్ల, ప్రతీక్ పరిదా
రేటెడ్ 900 లోపు
సాయి వెంకట్ శాన్విత్ నందన్ అలహరి, లూకాస్ లియు, పూర్వాన్స్ నాయక్
రేటెడ్ ఓపెన్
సాయి రేయాన్ష్ నగిశెట్టి, లోహిత్ శ్రీ కృష్ణ ఎంగళ్ళ, సిధ్ తివారీ

