🕑 Published: March 20, 2026 at 09:29 AM CST
శంకర నేత్రాలయ న్యూజెర్సీ విభాగం ఆధ్వర్యంలో గత శనివారం ఎడిసన్‌లోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో ‘మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ‘అడాప్ట్-ఎ-విలేజ్’ నేత్ర శిబిరాల కోసం $150000 (₹1.4కోట్లు) నిధులు సమకూరాయి. బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు సుధాకర్ ఉప్పల, ఇందిరా దీక్షిత్ ప్రారంభోపన్యాసాలు చేయగా, అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి సంస్థ సేవలపై వివరించారు. కార్యక్రమంలో లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ యూఎస్ఏ, కూచిపూడి డాన్స్ సెంటర్, నాట్య తత్వ శ్రీ సాయి వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్, కలగంగోత్రి ఫౌండేషన్, సిద్ధేంద్ర కూచిపూడి ఆర్ట్ అకాడమీ, చిన్మయి నృత్యాలయ, సౌపర్ణిక డాన్స్ అకాడమీ, చైతన్య జుర్రు, కూచింద్రియా డాన్స్ గ్రూప్ ప్రదర్శనలు ఇచ్చాయి. పద్మ మోనా, రాధిక గన్నేల ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసాద్ రెడ్డి కాటమ్‌రెడ్డి హాజరయ్యారు. MESU అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్‌లలో డా. రాఘవ రెడ్డి గోసాల, డా. ప్రియా కొర్రపాటి, వెంకట్ కన్నన్, ప్రతాప్ జక్కా, శ్రీని-జ్యోతి బిక్కుమల్ల, సతీష్ రామయ్యపిళ్లై- కలైవాణి పన్నీర్‌సెల్వం, రవి రెడ్డి మరక, డా. ఎస్. యెజ్ఞాసుబ్రమణియన్, డా. శేషాకుమారి మూర్తి, డా. శ్రీనివాస మూర్తి, శ్రీనివాస్ ఈమని, శంకర్ శెట్టి ఉన్నారు. ఈ నిధులతో 2300 కంటి శస్త్రచికిత్సలు చేయబడతాయి. బాలారెడ్డి ఇందుర్తి, చివుకుల ఉపేంద్ర, డా. రాజేంద్ర మోదిలను సత్కరిస్తూ ఎడిసన్ మేయర్ సమీప్ జోషి తీర్మాన ప్రకటన చేశారు.
సాయి దత్త పీఠం వ్యవస్థాపకుడు రఘు శర్మ శంకరమంచి, డా. యు. నరసిమ్హారెడ్డి, న్యూజెర్సీ విభాగ కోశాధికారి మూర్తి రేకపల్లి, సభ్యులు సుధాకర్ ఉప్పల, ఇందిరా దీక్షిత్, దాము గేదల, ప్రమీల గోపు, ఉషా దరిసిపూడి, ముఖేష్ కాశివాలా, సురేష్ గౌరిశెట్టి, సురేష్ మాకం, రవి శంకర్ అప్పన, నరుణ్ విరాజ్ అప్పన, శ్వేతా నాగిరెడ్డి, నందిని దార్గుల, హారిక గడ్డంపల్లి, ఆధ్యాకపూర్, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, ఆది మోరెడ్డి, రేఖారెడ్డి, నీలిమ గడ్డమనుగు, పిరమ్ మణికవాసగం, డా. భవానీ శ్రీనివాసన్, అనితా సింగ్, ప్రీతిక జక్క, త్యాగరాజన్, దీన్ దయాలన్ తదితరులు పాల్గొని సహకరించారు. విరాళాలు Sankara Nethralaya USA, 7238 Muncaster Mill Rd, No. 522, Derwood, MD 20855 కు పంపవచ్చు. టోల్-ఫ్రీ: (855) 463-8472.





