🕑 Published: March 21, 2026 at 07:34 PM CST
నార్వే తెలుగు సంఘం(NTA) ఆధ్వర్యంలో దశమ వార్షికోత్సవం, ఉగాది వేడుకలు సందడిగా సాగాయి. ఓస్లో నగరంలో నిర్వహించిన ఈ దశాబ్ది ఉత్సవాలు ప్రవాస భారతీయుల సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పాయి. ప్రవాస తెలుగు వారు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమానికి Akershus కౌంటీ డిప్యూటీ మేయర్ ఓలే జాకబ్ జోహన్సెన్, నార్వేలోని భారత రాయబార కార్యాలయ సెకండ్ సెక్రటరీ ఎస్.మాగేష్ కుమార్, ఆస్కర్ మేయర్ లెనె కాన్రాడి అతిథులుగా విచ్చేశారు.
భారతదేశం నుండి వెంకయ్యనాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ అభినందనలను వీడియో సందేశంలో పంపించారు. స్థానిక ప్రవాస చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, స్టాక్‌హోమ్ 'అలెన్ స్కూల్ ఆఫ్ డాన్సెస్' ప్రదర్శన, నాట్య కళాభారతి డాక్టర్ సరళకుమారి కూచిపూడి నృత్యం, ముద్ర డాన్స్ అకాడమీ ప్రదర్శన ఆకట్టుకున్నాయి. మాజీ కార్యవర్గ, బోర్డు సభ్యులను వారి సేవలకు గుర్తింపుగా సత్కరించారు.





