🕑 Published: March 17, 2026 at 08:36 PM CST
కువైత్‌లోని సాల్మీయా ప్రాంతంలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఆధ్వర్యంలో మైనారిటీ నాయకులు ముస్తాఖ్ ఖాన్, యువనాయకులు ఓలేటి రెడ్డయ్య చౌదరి అధ్యక్షతన ఇఫ్తార్ విందు జరిగింది.
ఈ కార్యక్రమంలో కువైత్‌లోని తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవాసాంధ్రులు, వివిధ మతాలకు చెందిన ప్రముఖులు, సామాజిక సేవకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సోదరభావం, మతసామరస్యం, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించే విధంగా ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమం ఎంతో ఆత్మీయంగా సాగింది.
