మలేషియాలో కేటీఆర్ జన్మదిన వేడుకలు

🕑 Published: July 26, 2026 at 10:41 AM CST

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ఇచ్చిన "Gift A Smile" పిలుపుకు స్పందిస్తూ బీఆర్ఎస్ మలేషియా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. వేడుకలు, కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలకు బదులుగా సమాజంలో అవసరమైన వారికి చేయూతనివ్వాలనే కేటీఆర్ ఆలోచనకు అనుగుణంగా, మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఉన్న ఓ అనాథ శరణాలయంలో చిన్నారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథ చిన్నారులకు పండ్లు, స్టేషనరీ సామగ్రిని పంపిణీ చేయడంతో పాటు, శరణాలయ నిర్వహణకు ఆర్థిక సహాయాన్ని అందించారు. చిన్నారులతో ఆప్యాయంగా గడుపుతూ, వారి ముఖాల్లో చిరునవ్వులు నింపడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతి కుర్మ మాట్లాడుతూ కేటీఆర్ జన్మదినాన్ని ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం తమకు గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మలేషియా వ్యవస్థాపకుడు చిట్టి చిరుత, ఉపాధ్యక్షుడు అరుణ్ మునిగల, కార్యదర్శి సందీప్ కుమార్ లగిశెట్టి, కమిటీ సభ్యులు సత్యనారాయణరావు నడిపెల్లి, హరీష్ గుడిపాటి, సురేష్, శ్యామ్, పూర్ణచందర్ రావు, క్రాంతి, అభినయ్, కృష్ణ, సందీప్ గాజెంగి, గౌతమ్, శేషి, రమేష్, సందీప్ గౌడ్, సురేందర్, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
డల్లాస్‌లో జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణబెల్జియంలో 54వ ఎన్నారై బీఆర్ఎస్ శాఖ ప్రారంభంబాయ్స్ నేషన్ ఉపాధ్యక్షుడిగా క్రిష్ కొర్రపాటిHTSL: వైభవంగా ముగిసిన నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగంఆస్ట్రేలియాలో కేటీఆర్ జన్మదిన వేడుకలుకాలిఫోర్నియాలో పర్యటించిన మంత్రి సీతక్కజీవితంలో ఒత్తిడి సమన్వయంపై టాంపాలో నాట్స్ సదస్సుశుక్రవారం డల్లాస్ పర్యటనకు తితిదే మాజీ ఈవో ధర్మారెడ్డిఆస్ట్రేలియాలో ఎన్నారై బీఆర్ఎస్ 12వ వార్షికోత్సవ వేడుకలుDay5-HTSL: వేల మంది భక్తుల సమక్షంలో సహస్ర కమలార్చనDay4-HTSL: శతచండీ సహిత రుద్రయాగంలో సహస్ర కుంకుమార్చనఆగష్టు 1న సిలికానాంధ్ర రజతోత్సవం. మూడు గిన్నీస్ రికార్డు లక్ష్యంగా ఏర్పాట్లు.ఒకే టొర్నీలో మూడు పతకాలు..అట్లాంటా తెలుగు బాలిక ప్రతిభఅరుణ-చండీ-రాజశ్యామల హోమాలతో మూడో రోజు ఆధ్యాత్మిక వైభవంరెండో రోజు వైభవంగా కొనసాగిన శతచండీ సహిత రుద్రయాగంసెయింట్‌లూయిస్‌లో వైభవంగా ప్రారంభమైన శతచండీ సహిత రుద్రయాగంBaltimore Set to Host ATA's 19th Conventionవైవిధ్యభరితంగా ఆటా 19వ మహాసభలున్యూజెర్సీలో వినుకొండ యువతి మక్కెన ప్రసన్న మృతిన్యూజెర్సీలో రాయలసీమ ప్రవాసుల సమావేశం
Previous Article Next Article