నా వర్తమాన విజయాలన్నీ గతతరపు గాథలే. తానాలో డా. ముక్కామల బాబీ.

Featured Image

బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడి గెలిచినా, భారతీయ/తెలుగు మూలాలున్న వ్యక్తిగా 180 ఏళ్ల అమెరికన్ మెడికల్ అసోసియేషన్(AMA) చరిత్రలో అధ్యక్షుడిగా తొలిసారిగా ఎన్నికైనా.. ఆ విజయాలన్నీ పరాయి దేశం నుండి అమెరికాకు వలస వచ్చి కష్టపడి అంచలంచెలుగా ఎదిగిన ప్రతి కుటుంబంలోని పాత తరానికి చెందుతాయని డా. ముక్కామల శ్రీనివాస్(బాబీ) అన్నారు. గురువారం నాటి తానా బ్యాంక్వెట్ విందులో ఆయన్ను తానా పురస్కారంతో సత్కరించారు. కామినేని శ్రీనివాస్ చేతుల మీదుగా అవార్డును అందుకున్న అనంతరం ఆయన ప్రసంగించారు.

గత తరం వేసిన పునాదుల మీద, వారి కష్టం మీద సుఖంగా ప్రయాణించిన తన లాంటి వారందరూ ఆ నిజాన్ని అనుక్షణం గుర్తుంచుకోవాలని బాబీ కోరారు. ఇవాళ మనం వేసే ప్రతి అడుగు రేపు మరో చరిత్రకు బాటలు వేస్తుందని తెలిపారు.

Tags-AMA President Mukkamal Srinivas Bobby Felicitated At 2025 TANA 24th Conference Banquet In Detroit

ama-president-mukkamal-srinivas-bobby-felicitated-at-2025-tana-24th-conference-banquet-in-detroit ama-president-mukkamal-srinivas-bobby-felicitated-at-2025-tana-24th-conference-banquet-in-detroit

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles