శ్రీనివాస కళ్యాణంతో ప్రారంభమైన నాట్స్ రెండోరోజు వేడుక

Featured Image

టాంపాలో జరుగుతున్న నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల రెండోరోజు కార్యక్రమం దేవదేవుడు శ్రీవేంకటేశ్వరుని కళ్యాణంతో ప్రారంభమైంది. బాలకృష్ణ-వసుంధర దంపతులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. రెండోరోజు స్థానిక ప్రవాసుల ప్రదర్శనలు, స్టాళ్లు, వినోదభరిత కార్యక్రమాలు, సాహితీ చర్చలు, ప్రవాసుల సమ్మేళనాలు ఏర్పాటు చేశారు.

తనికెళ్ల భరణి సహకారంతో ప్రచురించిన హంస వింశతి పుస్తకాన్ని ఆవిష్కరించి బాలకృష్ణ ప్రసంగించారు. ఆధునిక సాంకేతికతకు మూలం పురతాన విజ్ఞానమని కొనియాడారు. పిల్లలకు పుస్తకాల సారం గ్రహించేలా ప్రోత్సహించాలని కోరారు. పారుపల్లి రంగనాథ కచేరీ అలరించింది.

నాట్స్ సంబరాల కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్, బోర్డు ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మందాడి శ్రీహరి, మాజీ అధ్యక్షుడు మదన్ పాములపాటి, కార్యదర్శి మల్లాది శ్రీనివాస్, మిక్కిలినేని సుధీర్, నందమూరి రామకృష్ణ, పితాని సత్యనారాయణ, మన్నవ మోహనకృష్ణ, మురళీ మేడిచర్ల, ఆలపాటి రవి, సుధీర్ అట్లూరి, హరనాథ్ బుంగతావుల, గోపీచంద్ మలినేని, డా. మధు కొర్రపాటి, మంచికలపూడి శ్రీనివాసబాబు, పాతూరి నాగభూషణం, కూచిభొట్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Tags-NATS Tampa 2025 8th Sambaralu 2nd Day Started With Srinivasa Kalyanam Balakrishna

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles