ముగిసిన తానా 24వ మహాసభలు

Featured Image

డిట్రాయిట్‌ సబర్బ్‌ నోవైలోని సబర్బన్‌ కలెక్షన్‌ షోప్లేస్‌లో జూలై 3 నుంచి 5వ తేదీ వరకు జరిగిన తానా 24వ ద్వైవార్షిక మహాసభలు శనివారం రాత్రి ముగిశాయి. హీరోయిన్‌ సమంత, ఐశ్వర్యరాజేష్‌, తమన్‌ సంగీత విభావరి ముగింపు వేడుకకు వన్నె తెచ్చాయి. తనకు తానా వేదికపై నిలబడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని సమంతా అన్నారు. ప్రతి ఏటా తానా గురించి వింటూనే ఉన్నానన్నారు. సభల సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలిచిన జట్లకు అవార్డులను బహకరించారు.

స్థానిక కళాకారులు ప్రదర్శించిన గోపికా నృత్యం, గజేంద్రమోక్షం నాటకం, శ్రీవారి వైభవం నృత్యరూపకం, హైదరాబాద్‌లోని అక్షర గ్రూపు ప్రదర్శించిన నందకిషోరుడు శాస్త్రీయ నృత్యం, కృష్ణం వందే జగద్గురుమ్‌ ఫ్యూషన్‌ డ్యాన్స్‌, మోహినీ భస్మాసుర నృత్యరూపకం అలరించాయి. ఇంద్రనీల్‌ శివతాండవం ఆకట్టుకుంది. తానా అధ్యక్షుడిగా ఎన్నికైన నరేన్‌ కొడాలి ముగింపు రోజున బాధ్యతలు చేపట్టారు. నూతన కార్యవర్గం కుడా పదవీ బాధ్యతలు చేపట్టారు.

మురళీమోహన్‌కు తానా జీవితసాఫల్య పురస్కారాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడుకు తెలుగుతేజం అవార్డు, ఎల్‌.వి. ప్రసాద్‌ అవార్డును ఆయన మనవరాలు రాధ, ధర్మారావుకు సంస్కృతీ రత్న అవార్డును బహుకరించారు. ఈ మహాసభలను విజయవంతం చేసినవారికి కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ గంగాధర్‌ నాదెళ్ళ, కన్వీనర్‌ ఉదయ్‌కుమార్‌, డైరక్టర్లు సునీల్‌ పంత్ర, కిరణ్‌ దుగ్గిరాల, జోగేశ్వరరావు పెద్దిబోయినలు ధన్యవాదాలు తెలిపారు.

Tags-TANA 24th Conference Concludes With Samantha And Thaman Show

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles