జలం ఉంది..తోడుకోగలిగే శక్తి ఉన్నవారు కావాలి

Featured Image

ప్రస్తుత సినిమాల్లో ఆలోచన రేకెత్తించేవి, ఉత్సేజపరిచేవి, ప్రేరణాత్మకమైనవి ఎందుకు రావట్లేదనే ప్రవాసుల ప్రశ్నలకు రచయిత తనికెళ్ల భరణి సమాధానమిచ్చారు. తమ వద్ద, తన లాంటి రచయితల వద్ద కావల్సినంత జలం(ప్రతిభ) ఉందని, కానీ దాన్ని తోడి తీసుకోగలిగే సామర్థ్యమున్న వ్యక్తులు (నిర్మాతలు, దర్శకులు, హీరోలు) దొరకడం అరుదుగా జరుగుతోందని వ్యాఖ్యానించారు. టాంపాలో నాట్స్ సంబరాల్లో ముగింపు రోజు ఆదివారం మధ్యాహ్నం చలంచిత్ర గీత రచయితలతో ముఖాముఖి ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పాట గతి, తమకు ఎదురయ్యే సవాళ్లు, ఆలోచనా సరళి, పాట క్రమం, పాట రూపం వంటివాటిపై విస్లేషనాత్మకంగా మాట్లాడారు. మిధునం సినిమా వెనుక ఉన్న అరుదైన అనుభవాలను భరణి సభికులతో పంచుకున్నారు. రామజోగయ్య, చంద్రబోస్, కళ్యాణ్ చక్రవతి, వీణాపాణి, వివేఖ్ ఆత్రేయలు ప్రసంగించారు.

కొండవీటి జ్యోతిర్మయి స్థానిక చిన్నారులతో కలిసి కచేరీ నిర్వహించారు.

Tags-NATS Day2 Morning BreakOut Sessions - Bharani Chandrabose Ramajogayya Kondaveeti Jyotirmai Attends

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles