పేద విద్యార్థులకు బ్యాక్‌ప్యాక్లు అందజేసిన తానా డాలస్ విభాగం

Featured Image

హర్స్ట్-యులస్-బెడ్‌ఫోర్డ్(HEB ISD)కు చెందిన 300మంది పేద విద్యార్థులకు తానా డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో ఉచితంగా స్కూలు బ్యాగులను పంపిణీ చేశారు. తానా మాజీ అధ్యక్షుడు డా.నవనీత కృష్ణ ఆలోచనతో రూపొందిన ఈ కార్యక్రమం ద్వారా అమెరికాలో ప్రతి ఏటా వేలాది మంది నిరుపేద విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు.

అమెరికా సమాజంతో మమేకమయ్యే నిమిత్తం పేద పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని తానా డాలస్ విభాగ ప్రాంతీయ సమన్వయకర్త సతీష్ కోటపాటి అన్నారు. H.E.B ISD సూపరింటిండెంట్ డా. జో హ్యారింగ్టన్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా తానా సంస్థ తమ పాఠశాలకు విరాళం ఇస్తున్నారని ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మల్లి వేమన, ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ కొమ్మన, జాయింట్ సెక్రటరీ లోకేష్ నాయుడు కొణిదాల, ఫౌండేషన్ ట్రస్టీ డా. ప్రసాద్ నల్లూరి, మీడియా కోఆర్డినేటర్ పరమేష్ దేవినేని, కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని, అను ప్రసాద్ యలమంచిలి, సుజయ్ ఇనగంటి, రాజేంద్ర ముప్పలనేని, అనిల్ రాయల, వెంకటేష్ యలమంచి, ఈశ్వర్ గుండు, చినసత్యం వీర్నపు, సుధీర్ చింతమనేని తదితరులు పాల్గొన్నారు. డాలస్ తానా విభాగం చొరవను అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి అభినందించారు.

Tags-TANA DFW Donates Backpacks To Poor Kids In HEB ISD

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles