వాషింగ్టన్ డీసీలో గ్రంధాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల

Featured Image

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో భాను మాగులూరి ఆధ్వర్యంలో రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావును ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సాటి మనిషి కష్టాన్ని గుర్తించిన తెలుగుదేశం ప్రభుత్వం దివ్యాంగులకు, వృద్ధులకు, వితంతువులకు దేశంలో ఎక్కడ లేని విధంగా, పెన్షన్లు పంపిణి చేస్తొందన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేస్తూ ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు. దివ్యాంగులకు పార్టీలో ప్రాధాన్యతనిచ్చారని కొనియాడారు. మంచి పుస్తకం మంచి నేస్తంతో సమానమని సూచించారు. మన్నవ సుబ్బారావు, చల్లా జక్కిరెడ్డి, చామర్తి శ్రావ్య, బోనాల రామకృష్ణ, దొప్పలపూడి అరుణ్ కుమార్, పునుగువారి నాగిరెడ్డి, బండి సత్తిబాబు, నంబూరి చంద్రనాధ్, చల్లా సుబ్బారావు, వనమా లక్షినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags-AP Library Parishat Chairman Gonuguntla In Washington DC

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles