డల్లాస్‌లో ధర్మవరం వ్యక్తి దారుణ హత్య

Featured Image

డల్లాస్ నగరంలోని తూర్పు ప్రాంతంలో ఓ మోటెల్ నడుపుతున్న ధర్మవరానికి చెందిన ప్రవాసాంధ్ర వ్యక్తి మల్లయ్య నాగచంద్రమౌళి (50) దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం ఉదయం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసులు తెలిపారు.

గుజరాతీల నుండి మోటెల్‌ను లీజుకు తీసుకుని మల్లయ్య నాగ చంద్రమౌళి తూర్పు డల్లాస్‌లో వ్యాపారం నిర్వహిస్తున్నారు. అదే హోటల్‌లో పనిచేస్తున్న మార్టినెజ్(37) అనే యువకుడిని పనిచేయని వాషింగ్ మెషీన్ వాడొద్దన్నందుకు ఆగ్రహించి చంద్రమౌళి భార్య, కుమారుడి ఎదుట కత్తితో తలనరికి చెత్తకుండీలో పడవేశాడని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. చంద్రమౌళి కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ జరగాల్సిన దారుణం జరిగిపోయింది. నిందితుడికి కఠిన శిక్ష విధించేందుకు కృషి చేస్తామని డల్లాస్ పోలీస్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ చీఫ్ టెరెన్స్ రోడ్స్ తెలిపారు.

Tags-Dharmavaram NRT Chandramouli Mallayya Killed In East Dallas Motel

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles