చికాగోలో విజయవంతంగా ఆటా క్రికెట్ పోటీ

Featured Image

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో శనివారం నాడు ఇలినాయిస్‌లోని గ్లెండేల్ హైట్స్ కెమెరా పార్క్‌లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. 7 ఓవర్లు, 7 ఆటగాళ్ల ప్రత్యేక ఫార్మాట్‌లో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. చివరి మ్యాచ్‌ సూపర్ ఓవర్‌లో స్ట్రైక్ ఫోర్స్ జట్టు తానా లెజెండ్స్‌పై విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. టోర్నమెంట్‌ను ఆటా సెక్రటరీ సైనాథ్ రెడ్డి బోయపల్లి, ట్రస్టీలు వేన్ రెడ్డి, ఆర్వీ రెడ్డి, రత్నాకర్ అర్జుల సమన్వయపరిచారు.

ఈ టోర్నమెంట్‌లో తానా లెజెండ్స్, యోధాస్, స్ట్రైక్ ఫోర్స్, చికాగో లోకల్స్, గబ్రస్, NATS, ATA, ఎస్ఆర్‌కే లయన్స్ జట్లు ఉత్సాహంగా పోటీ పడ్డాయి. స్ట్రైక్ ఫోర్స్‌కు చెందిన అనీస్‌కు MVP, తానా లెజెండ్స్‌కి చెందిన సుమంత్‌కు బెస్ట్ బ్యాట్స్‌మన్, స్ట్రైక్ ఫోర్స్ జట్టు వెంకట్ పులికి బెస్ట్ బౌలర్ అవార్డులు లభించాయి. రన్నరప్ కెప్టెన్ భద్ర బొప్పనకు గిఫ్ట్ కార్డు అందజేశారు.

ఆటా వ్యవస్థాపకుడు హనుమంతరెడ్డి, కె.కె.రెడ్డి, ఆటా కార్యదర్శి సాయినాథ్ బోయపల్లి, BOT సభ్యులు వేన్ రెడ్డి, ఆర్వీ రెడ్డిలు విజేతలకు మొమెంటోలు ఇచ్చారు. భాను స్వర్గం, లక్ష్మణ్ రెడ్డిశెట్టి, వెంకట్ తూడి, మహిపాల్ వంచా, తానా నుంచి హేమ కనూరు, NATS నుంచి మదన్ పాములపాటి, ప్రవీణ్ వేములపల్లి తదితరులు సహకరించారు.

Tags-Chicago ATA Cricket Competitions 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles