శాస్త్ర-సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్

Featured Image

టెక్నాలజీ విప్లవంతో కుగ్రామంగా మారిన ప్రపంచంలో సమాచార బదిలీ వేగవంతమయిపోయిందని, దీన్ని అందిపుచ్చుకుని నూతన అవకాశాలను సృష్టిస్తూ ఏపీని అగ్రస్థానంలో నిలపాలని ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమి ఛైర్మన్ రవి మందలపు అన్నారు. న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ హాలులో ప్రవాసాంధ్రులు ఆయనను ఆదివారం నాడు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ...వేగంగా మారుతున్న సాంకేతిక రంగాన్ని ఆకళింపు చేసుకోవాలని, తద్వారా అభివృద్ధి, ఉద్యోగవాకాశాలను సాధించవచ్చునని అన్నారు. ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమి ద్వారా దీని కోసం కృషి చేస్తానని తెలిపారు.

గుంటూరు మిర్చీ యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ ప్రతిభావంతులైన, సృజనాత్మకత కలిగిన యువతకు సరైన వేదిక లభిస్తే ప్రపంచంలోనే ముందువరుసలో ఉంటారని సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా సంపద సృష్టించి రాష్ట్రంలో, దేశంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపాలని కోరారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస్ భీమినేని, శ్రీనాథ్ రావుల తదితరులు సమన్వయపరిచారు. శ్రీధర్ చిల్లర, తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags-Andhra Pradesh Science And Tech Academy Chairman Mandalapu Ravi Felicitated In NJ

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles